Prabhas: అన్నీ తెలిసిన బుద్ధుడు ఆయన... మాటల్లో వెటకారం ఉంటుంది: 'రాధేశ్యామ్' లో కృష్ణంరాజు పాత్రపై ప్రభాస్ స్పందన

Prabhas expalins Krishnamraju role in Radhe Shyam
  • ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్
  • రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 11న విడుదల
  • రాధేశ్యామ్ లో పరమహంసగా కృష్ణంరాజు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ సమీపిస్తుండడంతో ప్రభాస్ సహా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ప్రభాస్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధేశ్యామ్ చిత్రంలో తన పెదనాన్న కృష్ణంరాజు కూడా నటించడంపై స్పందించారు. 

కృష్ణంరాజు ఈ చిత్రంలో 'పరమహంస' అనే పాత్రలో కనిపిస్తారని ప్రభాస్ వెల్లడించారు. అన్నీ తెలిసిన బుద్ధుడు తరహాలో ఆయన పాత్ర ఉంటుందని, అయితే మాటల్లో వెటకారం ఉంటుందని అన్నారు. పరమహంస పాత్రను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఆ విధంగా తీర్చిదిద్దాడని తెలిపారు. షూటింగ్ లో ఆయన ఎంతో సరదాగా ఉండేవారని, డైరెక్టర్ తోనూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడేవారని వివరించారు. పెదనాన్న ఎనర్జీ చూసి సెట్స్ లో ఆయనతో మాట్లాడేందుకు అందరూ తననే ముందుకు నెట్టేవాళ్లు అని ప్రభాస్ వెల్లడించారు. 

గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లో తన పెదనాన్నతో కలిసి బిల్లాలో నటించానని, రాధేశ్యామ్ చిత్రంతో ఆయనకు హిట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.
Prabhas
Krishnamraju
Paramahamsa
Radhe Shyam

More Telugu News