Telangana: వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ - 3
- హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 1,500 కోట్లు
- మేకలు, గొర్రెల పంపిణీ పథకానికి రూ. 1,000 కోట్లు
- విద్యుత్ సబ్సిడీలకు రూ. 10,500 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 86 శాతం అధికంగా ఉందని చెప్పారు.
బడ్జెట్ ప్రసంగంలోని ఇంకొన్ని హైలైట్స్:
- కేసీఆర్ కిట్ పథకానికి రూ. 443 కోట్లు
- ఉపకారవేతనాలకు రూ. 4,688 కోట్లు
- ఆహార సబ్సిడీకి రూ. 2,787 కోట్లు
- ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు
- ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కు రూ. 1,343 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డుకు రూ. 500 కోట్లు
- సచివాలయ భవనాల నిర్మాణానికి రూ. 400 కోట్లు
- పరిశ్రమల ప్రోత్సాహానికి రూ. 2,519 కోట్లు
- హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 1,500 కోట్లు
- ఎయిర్ పోర్ట్, మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు
- పాతబస్తీకి, మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు
- మేకలు, గొర్రెల పంపిణీ పథకానికి రూ. 1,000 కోట్లు
- ఎస్టీ నివాస ప్రాంతాల్లో నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
- పట్టణ ప్రగతికి రూ. 1,394 కోట్లు
- పట్టణ ప్రాంతాల మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు
- కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక వలయానికి రూ. 750 కోట్లు
- సుంకిశాల ఇన్ టేక్ ప్రాజెక్టుకు రూ. 725 కోట్లు
- పోలీస్ శాఖ భవనాల నిర్మాణానికి రూ. 648 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు
- రైతుబంధు తరహాలో నేత కార్మికులకు ప్రత్యేక పథకం
- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం. తొలి విడతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్ల పంపిణీ
- హైదరాబాద్ పరిధిలోని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ. 12.5 కోట్లు
- విద్యుత్ సబ్సిడీలకు రూ. 10,500 కోట్లు
- పరిశ్రమల విద్యుత్ రాయితీలకు రూ. 190 కోట్లు
- పావలా వడ్డీ పథకానికి రూ. 187 కోట్లు
- ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
- మహిళా యూనివర్శిటీకి రూ. 100 కోట్లు