Sharmila: సొంతరాష్ట్ర రైతులను ఆదుకోవడం చేతకాని మీరు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు దొరా?: ష‌ర్మిల

sharmila slams kcr

  • హామీలతో కడుపు నింపడం దొరకు వెన్నతో పెట్టిన విద్య
  • వంద శాతం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్నారు
  • ఇచ్చిన హామీని వంద శాతం ఎగ్గొట్టాడు
  • హామీ ఇచ్చి నాలుగేండ్లయినా ఎరువులు ఇచ్చింది లేదన్న షర్మిల 

తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. సొంత రాష్ట్ర రైతులను ఆదుకోవడం చేతకాని సీఎం కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ఆమె ప్ర‌శ్నించారు.  

'గాల్లో మేడలు కట్టడం, హామీలతో కడుపు నింపడం దొరకు వెన్నతో పెట్టిన విద్య. వంద శాతం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ గారు, ఇచ్చిన హామీని వంద శాతం ఎగ్గొట్టాడు. హామీ ఇచ్చి నాలుగేండ్లయినా ఎరువులు ఇచ్చింది లేదు. కనీసం ఎప్పుడిచ్చేది చెప్పింది లేదు.

పెట్టిన పెట్టుబడి రాక, ఎరువుల భారం మోయలేక, వ్యవసాయం సాగలేక రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నా, రైతును ఆదుకోరు. ఇచ్చిన హామీలు అమలు చేయరు. రైతులు పాడె ఎక్కుతున్నా సారు మాత్రం దేశాలు ఏలడానికి పక్క రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నడు. సొంతరాష్ట్ర రైతులను ఆదుకోవడం చేతకాని మీరు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు దొరా?' అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. 

  • Loading...

More Telugu News