Russia: రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్.. పైలట్ మృతి

Ukraine shoots down Russian aircraft over Kharkiv pilot dead

  • 12వ రోజుకు చేరుకున్న యుద్ధం
  • ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ మిలటరీ
  • తప్పించుకునే సమయం కూడా లేక మృతి చెందిన పైలట్
  • కులినిచివ్ ప్రాంతంలో కూలిన విమానం

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేడు 12వ రోజుకు చేరుకుంది. ప్రపంచ దేశాల విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తుండగా.. ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీ చేస్తున్న విజ్ఞప్తులు ఎవరి చెవికీ ఎక్కడం లేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరువైపులా భారీగా నష్టం సంభవిస్తోంది. 

రష్యా దురాక్రమణ నేపథ్యంలో దాదాపు 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్ విడిచిపెట్టి వెళ్లిపోయారు. మరోవైపు, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పొరుగు దేశాలకు కూడా రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధ విమానాలను మోహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

ఇంకోవైపు, తమ దేశంపై బాంబులు కురిపించేందుకు వచ్చిన రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేసింది. ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. పైలట్‌కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News