Radhe Shyam: ప్రభాస్ 'రాధేశ్యామ్' పై ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ!

Cine critic Umair Sandhu review on Radhe Shyam

  • ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధేశ్యామ్
  • రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్
  • సెన్సార్ స్క్రీనింగ్ చూశానని ఉమైర్ సంధూ వెల్లడి!

తనను తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ తాజాగా రాధేశ్యామ్ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. రాధేశ్యామ్ ఫస్ట్ సెన్సార్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వెల్లడించారు. అసలు సిసలైన సినిమా అంటే రాధేశ్యామ్ అని కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ సరికొత్తగా ఉందని, సినిమా మొత్తానికి అది ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. 

రాధేశ్యామ్ చిత్రంలో గ్రాఫిక్స్ ను ఉపయోగించుకున్న విధానం అమోఘమని ఉమైర్ సంధూ కితాబిచ్చారు. ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ చూస్తుంటే ఒంట్లో కరెంటు ప్రవహిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని వివరించారు. ఎవరూ తీయని మిస్టరీ సబ్జెక్టుతో రాధేశ్యామ్ ను తెరకెక్కించారని వెల్లడించారు. 

క్లాస్, స్టయిల్ లో ప్రభాస్ ను కొట్టే మొనగాడు ఇండియాలో మరెవ్వరూ లేరని ఉమైర్ సంధూ ఆకాశానికెత్తేశాడు. రాధేశ్యామ్ లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించాడని, ఈ చిత్రంలో అతడి నటన, ఆహార్యం తనను విపరీతంగా ఆకట్టుకున్నాయని వివరించారు. 

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకున్న రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Radhe Shyam
Review
Umair Sandhu
Censor
Prabhas
Pooja Hegde
Tollywood
  • Loading...

More Telugu News