Ramcharan: బాహుబలి కాజా... రామ్ చరణ్ కు తియ్యని కానుక

Suruchi gifted Ramcharan Bahubali Kaja

  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్
  • రాజమండ్రిలో షూటింగ్
  • అభిమానులతో చెర్రీ ఫొటోషూట్
  • కాజాను బహూకరించిన సురుచి సంస్థ

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియడంతో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. కాగా, రాజమండ్రి వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ కు సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను సురుచి సంస్థ ప్రతినిధి వర్మ ఇక్కడి షెల్డన్ హోటల్లో రామ్ చరణ్ కు అందజేశారు.
 
రాజమండ్రి వచ్చే ప్రముఖులకు బాహుబలి కాజాను బహూకరించడం ఓ ఆనవాయతీగా వస్తోంది. గతంలో సమంత, నాగార్జున, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా తదితర సినీ తారలు కూడా ఈ స్పెషల్ కాజా రుచి చూశారు. తాజాగా, ఈ బాహుబలి కాజాను దర్శకుడు శంకర్ కు కూడా అందజేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరుపెట్టలేదు. రామ్ చరణ్ కు ఇది 15వ చిత్రం కావడంతో ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.
.

  • Loading...

More Telugu News