CPI Ramakrishna: రేపు అసెంబ్లీలో అమరావతిపై ప్రకటన చేయండి... సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

CPI Ramakrishna wrote CM Jagan

  • రాజధాని అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు
  • రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • హైకోర్టు తీర్పును గౌరవించాలన్న రామకృష్ణ
  • మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హితవు 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించాలని సీఎంను కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును గౌరవించాలని హితవు పలికారు. 

న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే విధంగా రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్ర అభివృద్ధిపై శాసనసభలో చర్చించాలని కోరారు.

CPI Ramakrishna
CM Jagan
AP Assembly Session
Amaravati
AP High Court
  • Loading...

More Telugu News