Roja: చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్ బాబూ... నీకు హ్యాట్సాఫ్: రోజా

Roja appreciates Mahesh Babu for his philanthropy

  • సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మహేశ్ బాబు
  • తాజాగా రెయిన్ బో హాస్పిటల్స్ తో చేయి కలిపిన వైనం
  • ఇప్పటికే వందలాది చిన్నారులకు గుండె ఆపరేషన్లు
  • మహేశ్ బాబు వీడియో పంచుకున్న రోజా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాలతోనే సరిపెట్టుకోకుండా, తన శక్తిమేర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గొప్ప మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఆయన ఇప్పటివరకు వందల సంఖ్యలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. అందుకు అవసరమైన ఖర్చును భరిస్తూ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల పాలిట ఆపద్బాంధవుడిలా అవతరించారు. 

తాజాగా ఆయన రెయిన్ బో హాస్పిటల్స్ గ్రూప్ కు చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తోనూ ఇదే తరహాలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్ బాబూ... నీకు హ్యాట్సాఫ్ అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ మేరకు రోజా సోషల్ మీడియాలో స్పందించారు. రెయిన్ బో హాస్పిటల్స్ చేపట్టిన కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతున్న వీడియోను కూడా ఆమె పంచుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News