sharvanand: 'నేనేమ‌న్నా ఉప్మాలో జీడీపప్పు రాలేద‌ని బాధ‌ప‌డుతున్నానా?' అంటోన్న శ‌ర్వానంద్.. కొత్త సినిమా ప్ర‌త్యేక టీజ‌ర్ విడుద‌ల‌

Aadavallu Meeku Johaarlu

  • హీరో శర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌
  • ఆయ‌న కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు 
  • ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన మూవీ

యంగ్ హీరో శర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు నుంచి మ‌రో ప్ర‌త్యేక టీజ‌ర్ విడుద‌లైంది. 'నేనేమ‌న్నా ఉప్మాలో జీడీపప్పు రాలేద‌ని బాధ‌ప‌డుతున్నానా? ఇంకా పెళ్లి కాలేద‌ని బాధ‌ప‌డుతున్నా' అంటూ శ‌ర్వానంద్ చెప్పిన డైలాగ్ అల‌రిస్తోంది. 

ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్. ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీల‌క‌ పాత్రల్లో న‌టించారు.  

   

  • Error fetching data: Network response was not ok

More Telugu News