Karthik Ratnam: హైదరాబాద్ అమ్మాయితో ‘నారప్ప’ ఫేం, ‘కేరాఫ్ కంచరపాలెం’ హీరో నిశ్చితార్థం

Karthik Ratnam Engaged To Hyderabad Young Lady

  • నిన్న హోటల్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక
  • హాజరైన హీరో నవీన్ చంద్ర
  • నారప్పలో నటనకు మంచి గుర్తింపు

‘నారప్ప’ సినిమాలో హీరో వెంకటేశ్ పెద్దకొడుకుగా నటించి మంచి మార్కులు కొట్టేసిన కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన యువతిని అతడు వివాహం చేసుకోబోతున్నాడు. శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర హాజరయ్యాడు. 

థియేటర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కార్తీక్ రత్నం.. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఆ తర్వాత నారప్ప సినిమాలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత చేసిన అర్ధశతాబ్దం సినిమా మిశ్రమ ఫలితాలనిచ్చింది. నితిన్ ‘చెక్’, ఇటీవల విడుదలైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలోనూ నటించాడు. 

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన కార్తీక్ సీఏ కోర్సును మధ్యలోనే ఆపేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా, కేరాఫ్ కంచరపాలెం సినిమాను తమిళంలో ‘కేరాఫ్ కాదల్’ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాలోనూ కార్తీక్ రత్నం లీడ్ రోల్ పోషించాడు.

Karthik Ratnam
Tollywood
Narappa
C/O Kancharapalem
  • Loading...

More Telugu News