Anil Kumble: ఆస్ట్రేలియన్లు నా జోలికి వచ్చేవాళ్లు కాదు... అందుకు కారణం వార్న్: అనిల్ కుంబ్లే

Anil Kumble recollects moments with Shane Warne

  • వార్న్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన కుంబ్లే
  • వార్న్ స్నేహితులను ఆస్ట్రేలియన్లు స్లెడ్జింగ్ చేయరని వెల్లడి
  • తనను ఒక్క మాట కూడా అనేవారు కాదని వివరణ

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం పట్ల క్రికెట్ ప్రపంచం ఇంకా తేరుకోలేదు. వార్న్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మాజీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. భారత లెగ్ స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే కూడా వార్న్ మరణంపై స్పందించాడు. ఈ సందర్భంగా కుంబ్లే ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. 

షేన్ వార్న్ తనకు మంచి స్నేహితుడని తెలిపాడు. మ్యాచ్ లలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు తన జోలికి వచ్చేవాళ్లు కాదని కుంబ్లే వివరించాడు. అందుకు కారణం వార్న్ తో స్నేహమేనని అన్నాడు. వార్న్ స్నేహితులను స్లెడ్జింగ్ చేయడానికి ఆస్ట్రేలియా జట్టు ముందుకు రాదని, తాను ఎప్పుడు బ్యాటింగ్ కు దిగినా ఆసీస్ ఆటగాళ్లు ఒక్క మాట కూడా అనేవారు కాదని వివరించాడు. ఆసీస్ జట్టు వ్యవహారాల్లో వార్న్ కు ఎంత పట్టు ఉంటుందో ఈ విషయం నిరూపిస్తుందని కుంబ్లే పేర్కొన్నాడు.

Anil Kumble
Shane Warne
Australia
Sledging
  • Loading...

More Telugu News