Amaravati: అమ‌రావ‌తిపై మ‌రోమారు మంత్రి అప్ప‌ల‌రాజు తీవ్ర వ్యాఖ్య‌లు

minister appala raju viral comments on amaravati

  • అమ‌రావ‌తిని క‌మ్మ‌రావ‌తిగా పేర్కొన్న మంత్రి
  • మూడు రాజ‌ధానుల‌ను చంద్ర‌బాబు అడ్డుకుంటున్నార‌ని వ్యాఖ్య‌
  • వికేంద్రీక‌ర‌ణ‌కే త‌మ ఓటని వెల్ల‌డి

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో ఈ అంశంపై వైసీపీ, టీడీపీ మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతోంది. గ‌తంలో అమ‌రావ‌తి కేవ‌లం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వారిదిగానే ఉందంటూ వైసీపీ నేత‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా నాటి సీఎం చంద్ర‌బాబు త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి లీకులిచ్చి వారు మాత్ర‌మే అక్క‌డ భూములు కొనుగోలు చేసేలా వ్య‌వ‌హ‌రించార‌ని స్వ‌యంగా సీఎం జ‌గ‌నే వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు సంబ‌రాలు చేసుకుంటున్న త‌రుణంలో జ‌గ‌న్ కేబినెట్‌లోని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అమ‌రావ‌తిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ రాజ‌ధానిగా టీడీపీ చెబుతున్న అమ‌రావ‌తి పేరును ప్ర‌స్తావించిన ఆయ‌న‌... అమ‌రావ‌తి కాద‌ని, అది క‌మ్మ‌రావ‌తేనంటూ మంత్రి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

మూడు రాజధానులను చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. ప్రతి విషయంపై చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఆర్‌డీఏ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిందని గుర్తు చేసిన ఆయ‌న‌...తమ విధానం వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై సీఎం వైఎస్‌ జగన్ ముందుకెళ‌తార‌ని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News