Mahesh Babu: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహేశ్ బాబు

Mahesh babu starts another initiative
  • సామాజిక సేవా కార్యక్రమాల్లో మహేశ్ భాగస్వామ్యం
  • ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ నేతృత్వంలో చిన్నారులకు సర్జరీలు
  • తాజాగా రెయిన్ బో హాస్పిటల్ తో అవగాహన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి హృద్రోగాలతో బాధపడుతున్న చిన్నారులకు కీలక ఆపరేషన్లు ఉచితంగా చేయించడం, భార్య నమ్రతతో కలిసి ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం తెలిసిందే. 

తాజాగా ఆయన మరో బృహత్ కార్యక్రమానికి ముందుకొచ్చారు. రెయిన్ బో హాస్పిటల్ కు చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో చేతులు కలిపారు. గుండెజబ్బులతో బాధపడే నిరుపేద చిన్నారులకు తన సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహేశ్ బాబు ఫౌండేషన్, ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ల మధ్య అవగాహన కుదిరింది. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మహేశ్ బాబు, రెయిన్ బో హాస్పిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Mahesh Babu
Rainbow Hospital
Mahesh Babu Foundation
Pure Little Hearts Foundation

More Telugu News