Prabhas: ముద్దు సన్నివేశాలే కాదు.. చొక్కాలేకుండా నటించాలన్నా ఇబ్బందే: ప్రభాస్

felt inconvenient in kissing scenes says Prabhas

  • మార్చ్ 11న విడుదల కాబోతున్న 'రాధే శ్యామ్'
  • ముద్దు సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించిందన్న ప్రభాస్
  • లవ్ స్టోరీ కాబట్టే అలాంటి సీన్లు ఉన్నాయని వ్యాఖ్య

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ మూవీ 'రాధే శ్యామ్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ సన్నివేశాల గురించి వివరించాడు. 

ముద్దు సీన్లు చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు. లవ్ స్టోరీ కాబట్టే సినిమాలో అలాంటి సీన్లు ఉన్నాయని... ఇబ్బంది అనిపించినా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు చేయలేనని చెప్పలేనని అన్నాడు. ముద్దు వద్దనుకుంటే చెప్పి తీసేయించవచ్చని... కానీ, లవ్ స్టోరీలకు అది కుదిరే పని కాదని చెప్పాడు. తనకు ముద్దు సన్నివేశాలే కాదు, చొక్కా లేకుండా నటించాలన్నా చాలా ఇబ్బందేనని అన్నాడు. షర్ట్ లేకుండా ఉండే సీన్లు చేసేటప్పుడు ముందు సెట్ లో ఎంత మంది ఉన్నారో చూసుకుంటానని చెప్పాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News