Manchu Vishnu: 'గాలి నాగేశ్వరరావు'గా మంచు విష్ణు!

Manchu Vishnu new movie update

  • యాక్షన్ కామెడీకి ప్రాధాన్యతనిచ్చే మంచు విష్ణు
  • కొంతకాలంగా ఎదురవుతున్న వరుస ఫ్లాపులు 
  • కొత్త బ్యానర్లో నిర్మాణానికి శ్రీకారం 
  • శ్రీను వైట్లతో ఇప్పట్లో లేనట్టే!  

మొదటి నుంచి కూడా మంచు విష్ణు తన తండ్రి తరహాలో యాక్షన్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. 'ఢీ' .. 'దేనికైనా రెడీ' .. 'దూసుకెళ్తా' .. 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. 'మోసగాళ్లు' ఫ్లాప్ తరువాత హీరోగా .. నిర్మాతగా ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు.  

ఇక ఇప్పుడు ఆయన తన పిల్లల పేరుతో ఎ.వి.ఎ. అనే బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని తానే హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగాడు .. ఆ సినిమా పేరే 'గాలి నాగేశ్వరరావు'. టైటిల్ ను బట్టే ఇది కామెడీ ప్రధానమైన  సినిమా అనే విషయం అర్థమవుతోంది. తాజాగా ఈ టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. 

ఇంతకుముందు 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈషాన్ సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కోన వెంకట్ కథ అందించగా భాను - నందు సంభాషణలు సమకూర్చుతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక శ్రీను వైట్లతో ఎనౌన్స్ చేసిన 'డి అండ్ డి' ఇప్పట్లో లేనట్టే అనుకోవాలి.

Manchu Vishnu
Kona Venkat
Gali Nageshwara Rao Movie
  • Loading...

More Telugu News