India: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 5921 fresh COVID19 cases

  • గత 24 గంటల్లో 5,921 కరోనా కేసులు 
  • దేశ వ్యాప్తంగా 289 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,878

భారత్ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 6 వేల దిగువకు చేరింది. గత 24 గంటల్లో 5,921 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 11,651 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రెండేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. గత 24 గంటల్లో 289 మంది కరోనాతో మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.63 శాతానికి క్షీణించింది. 

ఇక ఇప్పటి వరకు 4.29 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,23,78,721 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,14,878 లక్షల మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 63,878 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 1,78,55,66,940 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి కరోనా వల్ల చనిపోయినవారిలో 92 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోని వారే ఉన్నారని తెలిపింది.

India
Corona Virus
Updates
  • Loading...

More Telugu News