Virat Kohli: 100వ టెస్ట్ కు ముందు కోహ్లీకి ఆత్మీయ సత్కారం.. అనుష్కశర్మ, భారత టీమ్ సమక్షంలో.. వీడియో

Virat Kohli felicitated with a special cap by India coach Rahul Dravid

  • 100 టెస్ట్ క్యాప్, మొమెంటో బహూకరించిన ద్రవిడ్
  • చిన్న నాటి హీరో నుంచి తీసుకోవడం పట్ల కోహ్లీ ఆనందం
  • గ్యాలరీ నుంచి వీక్షించిన కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ

విరాట్ కోహ్లీ ఆత్మీయ సత్కారంతో పులకించిపోయాడు. శ్రీలంక - భారత్ జట్ల మధ్య నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. అరుదైన ఈ మైలురాయిని చేరుకుంటున్న విరాట్ కోహ్లీకి భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రత్యేక మొమెంటో, క్యాప్ ఇచ్చి అభినందించారు. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇది జరిగింది. ఇక్కడే భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.

భారత క్రికెట్ జట్టు బృందం చుట్టూ నించోగా.. మధ్యలో రాహుల్ ద్రవిడ్ ఒకవైపు, మరోవైపు కోహ్లీ, ఆయన భార్య, నటి అనుష్కశర్మ ఉన్నారు. దీన్ని చూసేందుకు కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా వచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తనకు ఇది ప్రత్యేక సందర్భంగా కోహ్లీ పేర్కొన్నాడు. ’’నా భార్య, సోదరుడు, అందరూ ఉన్నారు. ఇది జట్టుగా ఆడేది. మీరు లేకుండా నాకు ఇది సాధ్యమయ్యేది కాదు. ఒకే ఫార్మాట్ లో 100 మ్యాచ్ లు ఆడడాన్ని తదుపరి తరం ఆదర్శంగా తీసుకోవాలి’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. తన చిన్ననాటి హీరో నుంచి 100 టెస్ట్ క్యాప్ ను పొందడం పట్ల బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News