Anupama Parameshwaran: ఉత్కంఠను రేపుతున్న 'బటర్ ఫ్లై' టీజర్!

Butterfly movie update

  • అనుపమ ప్రధాన పాత్రగా 'బటర్ ఫ్లై'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • దర్శకుడిగా ఘంటా సతీశ్ బాబు
  • రిలీజ్ కి రెడీగా '18 పేజెస్' .. 'కార్తికేయ 2'

మొదటి నుంచి కూడా నటనకి అవకాశం ఉన్న విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ అనుపమ పరమేశ్వరన్ ముందుకు వెళుతోంది. 'అ ఆ' .. 'ప్రేమమ్' .. 'శతమానం భవతి' వంటి సినిమాలు ఆమెను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేశాయి. బరువైన పాత్రలను అనుపమ బాగా చేయగలదు అనే పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె నాయిక ప్రధానమైన ఒక సినిమాను చేస్తోంది .. ఆ సినిమా పేరే 'బటర్ ఫ్లై'. జెన్ నెక్స్ట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఘంటా సతీశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. తన ఇద్దరు చిన్నపిల్లలు కనిపించకపోవడంతో టెన్షన్ పడుతున్న సీన్స్ పై కట్ చేసిన టీజర్ అందరిలో ఉత్కంఠను పెంచుతోంది.

ఆ ఇద్దరు పిల్లలు ఏమైపోయారో తెలుసుకోవడం కోసం .. వాళ్లను కాపాడుకోవడం కోసం ఆమె పడే తాపత్రయానికి ఈ టీజర్ అద్దం పట్టింది. భూమిక ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక అనుపమ తాజా చిత్రాలుగా '18 పేజెస్' .. 'కార్తికేయ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News