Alex Konanykhin: పుతిన్ ను అరెస్ట్ చేసినా, చంపినా... రూ.7.5 కోట్లు ఇస్తా: అమెరికాలోని రష్యా కుబేరుడి ప్రకటన

Russian millionaire announces reward on Putin

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • పుతిన్ పై తీవ్ర వ్యతిరేకత
  • 1992లో రష్యాను వీడిన కొనానిఖిన్
  • అమెరికాలో వ్యాపార దిగ్గజంగా ఎదిగిన రష్యన్
  • పుతిన్ తీరుతో తీవ్ర ఆగ్రహం

పొరుగుదేశం ఉక్రెయిన్ పై దురాక్రమణ జరుపుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్వదేశంలోనూ పుతిన్ నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా, రష్యా కుబేరుడు ఒకరు పుతిన్ తలపై రివార్డు ప్రకించారు. 

రాజకీయ ఒత్తిళ్లతో రష్యాను విడిచిపెట్టి అమెరికాలో ఉంటున్న అలెక్స్ కొనానిఖిన్ ఓ సంపన్నుడు. అనేక రాజకీయపరమైన కారణాలతో కొనానిఖిన్ 1992లో రష్యాను వీడి అమెరికా చేరుకున్నారు. అక్కడే అనేక స్టార్టప్ లలో పెట్టుబడులు, క్రిప్టో వ్యాపారాలతో తన సంపదను వేల కోట్లకు పెంచుకున్నారు.

అయితే, పుతిన్ అనుసరిస్తున్న విధానాలు కొనానిఖిన్ కు కోపం తెప్పించాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ ఆగ్రహం మరింత పెరిగింది. అందుకే, పుతిన్ ను సజీవంగా బంధించినా, చంపేసినా భారీ మొత్తంలో నజరానా అందిస్తానని కొనానిఖిన్ ఓ ప్రకటన చేశాడు. 

ప్రస్తుత పరిస్థితులు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయని, పుతిన్ విధానాలతో రాజ్యాంగం అనేది ఉన్నా లేనట్టే అయిందని పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యయుత ఎన్నికలు లేకుండా చేసి, జీవితకాలం పాటు తానే రష్యా అధ్యక్షుడిగా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు. 

తాను కూడా రష్యా పౌరుడినే అని, దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని కొనానిఖిన్ పేర్కొన్నారు. అందుకే, పుతిన్ ను ప్రాణాలతో అరెస్ట్ చేసిన వారికి, లేదా చంపేసినా సరే... వారికి రూ.7.5 కోట్లు ఇస్తానని వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News