Ukraine: ఉక్రెయిన్‌లోని మన విద్యార్థుల చేతుల్లో భారత జాతీయ జెండా.. మువ్వన్నెల పతాకాన్ని ఎలా తయారుచేసుకున్నారంటే..!

Students in Ukraine use three colour sprays to make indian flg

  • జెండాలోని మూడు రంగులను కొనుగోలు చేసి పతాకాన్ని రూపొందించిన వైనం
  • అది పట్టుకుని క్షేమంగా సరిహద్దులకు
  • భారత జెండా మాటునే పాకిస్థాన్, టర్కీ విద్యార్థులు కూడా..

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు దేశాన్ని వీడాలంటే భారతీయ జెండా ఉండాలి. అది ఉంటేనే దేశాన్ని క్షేమంగా వీడే అవకాశం ఉంటుంది. లేదంటే వారిని కూడా ఉక్రెయిన్ పౌరులుగా భావించే అవకాశం ఉంది. కాబట్టి ఉక్రెయిన్‌ను వీడి సరిహద్దులకు చేరుకోవాలనుకునే భారత విద్యార్థులు మువ్వన్నెల జెండా పట్టుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అయితే, ఉక్రెయిన్‌లో భారత జాతీయ జెండా ఎక్కడ దొరుకుతుంది? అందుకనే మన విద్యార్థులు చక్కని ప్లాన్ వేశారు. 

భారత ప్రభుత్వం ఈ సూచన చేయగానే విద్యార్థులు వెంటనే మార్కెట్‌కు వెళ్లి మన జాతీయ పతాకంలోని మూడు రంగుల స్ప్రేలను కొనుగోలు చేశారు. ఆపై వాటిని వస్త్రంపై స్ప్రే చేసి జెండాను రూపొందించారు. అది పట్టుకుని ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా సరిహద్దులకు చేరుకోగలిగారు. ఉక్రెయిన్ లోని ఒడెసా నుంచి బుకారెస్ట్ చేరుకున్న ఓ విద్యార్థి ఈ విషయాన్ని వివరించాడు.

అంతేకాదు, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న టర్కీ, పాకిస్థాన్ విద్యార్థులు కూడా భారతీయ జెండా మాటునే ఉక్రెయిన్ దాటడం గమనార్హం. ఉక్రెయిన్ పొరుగు దేశమైన రొమేనియాలోని బుకారెస్ట్‌కు చేరుకున్న విద్యార్థులను భారత ప్రభుత్వం విమానాల ద్వారా తరలించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ గంగ’ పేరుతో విమానాలు నడుపుతోంది.

  • Loading...

More Telugu News