TSRTC: ప్రయాణికుల కోసం మరో స్కీమ్ తీసుకువచ్చిన తెలంగాణ ఆర్టీసీ

TSRTC announces another benefit for passengers

  • కొత్త సదుపాయం ప్రకటించిన ఆర్టీసీ
  • రిజర్వేషన్ చేయించుకున్న వారికి సిటీ బస్సు ప్రయాణం ఫ్రీ
  • 250 కిమీ పైన దూరప్రాంతాలకు వెళ్లేవారికి వర్తింపు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీగా సజ్జనార్ వచ్చాక వినూత్న కార్యక్రమాలతో సంస్థ ముందడుగు వేస్తోంది. తాజాగా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ ఆర్టీసీ మరో స్కీమ్ ప్రకటించింది. దీని ప్రకారం... 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే ప్రాంతాలకు టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నవారు తమ ఇంటి నుంచి బస్సు ఎక్కే బోర్డింగ్ పాయింట్ వరకు ఉచితంగా సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 

ప్రయాణం తర్వాత కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రయాణానికి 2 గంటల ముందు, ప్రయాణం తర్వాత 2 గంటల లోపు ప్రయాణికులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.

TSRTC
Passengers
Free Travel
City Bus
Reservation
Telangana
  • Loading...

More Telugu News