Ravichandran Ashwin: కపిల్ దేవ్ రికార్డును టార్గెట్ చేసిన అశ్విన్

Ravichandran Ashwin targets Kapil Dev record

  • టెస్ట్ క్రికెట్లో 434 వికెట్లు పడగొట్టిన కపిల్ దేవ్
  • ఇప్పటి వరకు 430 వికెట్లు తీసిన అశ్విన్
  • మరో ఐదు వికెట్లు తీస్తే కపిల్ ను దాటనున్న అశ్విన్

  టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు శ్రీలంకతో జరగనున్న సిరీస్ కీలకం కాబోతోంది. భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును అధిగమించేందుకు అశ్విన్ కు ఈ సిరీస్ అవకాశం కల్పిస్తోంది. టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ 434 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ ఇప్పటి వరకు 430 వికెట్లు తీశాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే కపిల్ సరసన నిలుస్తాడు. ఐదు వికెట్లు తీస్తే కపిల్ ను అధిగమిస్తాడు. 434 వికెట్లు తీయడానికి కపిల్ కు 131 టెస్టులు అవసరం కాగా.. అశ్విన్ 84 టెస్టుల్లోనే 430 వికెట్లు సాధించాడు. 

మరోవైపు అశ్విన్ మరో ఇద్దరు బౌలర్లను కూడా అధిగమించే అవకాశం ఉంది. మరో రెండు వికెట్లు తీస్తే 86 టెస్టుల్లో 431 వికెట్లు తీసిన న్యూజిలాండ్ దిగ్గజం సర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తాడు. మరో మూడు వికెట్లు తీస్తే 93 టెస్టుల్లో 433 వికెట్లు తీసిన శ్రీలంక వెటరన్ రంగనా హెరాత్ రికార్డును దాటేస్తాడు. ఈ నెల 4న మొహాలీలో శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభంకానుంది.

Ravichandran Ashwin
Kapil Dev
Test Cricket
Record
  • Loading...

More Telugu News