Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు రోజుల క్రితం పరిచయం.. మూడో రోజు యువతిపై అత్యాచారం: హైదరాబాద్‌లో ఘటన

Man Raped girl after two day relationship

  • రాజేంద్రనగర్‌లో ఘటన
  • కలుసుకుందామంటే నమ్మి వెళ్లిన యువతి
  • స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
  • నిందితుడికి అరదండాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో రెండురోజుల క్రితం పరిచయమైన యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సులేమాన్‌నగర్‌కు చెందిన సాజిత్ (27) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు రోజుల క్రితం సంతోష్‌నగర్‌కు చెందిన యువతి (20)తో పరిచయం అయింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని వాట్సాప్‌లో చాటింగ్ మొదలుపెట్టారు. 

ఈ క్రమంలో ఇద్దరం ఒకసారి కలుసుకుందామని యువతిని సాజిత్ కోరాడు. అతడిని నమ్మిన యువతి సరేనని రాజేంద్రనగర్ వచ్చింది. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని సులేమాన్‌నగర్‌లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె డయల్ 100కు కాల్ చేసి విషయం చెప్పింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad
Crime News
Rape
Instagram
  • Loading...

More Telugu News