Ukraine: పుతిన్‌కు తైక్వాండో షాక్.. బ్లాక్ బెల్డ్ రద్దు
- ఇప్పటికే జూడో అధ్యక్షుడి హోదాను కోల్పోయిన పుతిన్
- తాజాగా పుతిన్‌పై వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ ఆగ్రహం
- రష్యాతో పాటు బెలారస్‌లోనూ తైక్వాండో ఈవెంట్లను నిర్వహించబోమని వెల్లడి
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు ఆయన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేస్తే.. క్రీడారంగం నుంచి పుతిన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణించిన వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ రష్యా అధ్యక్షుడి హోదాలో పుతిన్‌కు ఇచ్చిన గౌరవ తైక్వాండో బ్లాక్ బెల్ట్ ను వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఫెడరేషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుతిన్‌కు షాకిచ్చింది.
ఇదిలా ఉంటే..ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగబడ్డ పుతిన్ ఇప్పటికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా బ్లాక్ బెల్ట్‌ను రద్దు చేసిన తైక్వాండో ఫెడరేషన్.. రష్యాతో పాటు ఆ దేశానికి మద్దతుగా నిలుస్తున్న బెలారస్‌లోనూ ఇకపై ఎటువంటి తైక్వాండో ఈవెంట్లను నిర్వహించబోమని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఫెడరేషన్ తన ట్వీట్‌లో పేర్కొంది.