Pavan kalyan: విజయ్ మూవీ రీమేకులో పవన్ .. రంగంలోకి 'సాహో' దర్శకుడు!

Pavan in Sujeeth Movie

  • రీమేకులపై పవన్ దృష్టి
  • 'వకీల్ సాబ్'తో హిట్ 
  • 'భీమ్లా నాయక్'తో బ్లాక్ బస్టర్  
  • 'తేరీ' రీమేక్ కి సన్నాహాలు

పవన్ కల్యాణ్ వరుస రీమేకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆల్రెడీ 'వకీల్ సాబ్' .. 'భీమ్లా నాయక్' రీమేకులతో ఆయన భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తమిళంలో కొంతకాలం క్రితం విజయ్ చేసిన 'తేరి' సినిమాకి ఇది రీమేక్ అని అంటున్నారు. 

కథ ఏమిటి? .. తన పాత్ర ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంతవుతుంది? ఏ పాత్రకి ఎవరు బాగా సెట్ అవుతారు? అనే విషయాల్లో రీమేకుల ద్వారా వెంటనే ఒక క్లారిటీ వస్తుంది. అందువలన రీమేకులకు పవన్ వెంటనే ఓకే చెబుతున్నారని అంటున్నారు. 'తేరి' రీమేక్ కోసం పవన్ ను ఒప్పించింది ఎవరో కాదు .. 'సాహో' దర్శకుడు సుజీత్ అట. 

'సాహో'వంటి భారీ సినిమాను చాలా చిన్న వయసులోనే హ్యాండిల్ చేశాడనే పేరు సుజీత్ కి వచ్చింది. ఆ తరువాత ఆయన కొన్ని కథలపై కసరత్తు చేస్తూ .. తాజాగా 'తేరి' రీమేక్ ను ఫైనల్ చేసుకున్నాడని అంటున్నారు. హరీశ్ శంకర్' .. సురేందర్ రెడ్డి ప్రాజెక్టుల తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.

Pavan kalyan
Krish
Harish Shankar
Sujeeth Movie
  • Loading...

More Telugu News