sebi: సెబీకి తొలి లేడీ బాస్‌గా మాధ‌బి పూరీ బుచ్‌

madhavi puri buch is sebi first lady boss

  • సోమ‌వారంతో ముగిసిన అజ‌య్ త్యాగి ప‌ద‌వీకాలం
  • మాధ‌బిని  నియ‌మిస్తూ కేంద్రం నిర్ణయం
  • మూడేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్న లేడీ బాస్‌

దేశంలో ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ను మ‌హిళ‌లు అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నూత‌న చైర్ ప‌ర్స‌న్‌గా మాధ‌బి  పూరీ బుచ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేబినెట్ అపాయింట్స్ మెంట్ క‌మిటీ ఆమె నియామ‌కానికి సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆమె ఈ ప‌ద‌విలో ఉంటారు. ఈ నియామ‌కంతో సెబీ చ‌రిత్ర‌లో ఓ మ‌హిళ ఆ సంస్థ‌కు బాస్‌గా నియ‌మితులైన‌ట్టయింది.  

సెబీ చైర్మ‌న్ అజ‌య్ త్యాగి ఐదేళ్ల ప‌ద‌వీ కాలం సోమ‌వారంతో ముగిసిపోయింది. ఈ నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే మాధ‌బిని సెబీ చైర్ ప‌ర్స‌న్‌గా నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. మాధ‌బి పూరీ బుచ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఐసీఐసీఐలో కెరీర్ ప్రారంభించిన ఆమె‌.. రెండు ద‌శాబ్దాల పాటు అదే బ్యాంకులో వివిద హోదాల్లో ప‌నిచేశారు. 2009 నుంచి 2011 మ‌ధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగానే కాకుండా సీఈఓగానూ వ్య‌వ‌హ‌రించారు.

  • Loading...

More Telugu News