Belarus: రష్యాకు మద్దతుగా నేరుగా యుద్ధ రంగంలోకి దిగనున్న బెలారస్?

Belarus may join Ukraine invasion

  • ఇప్పటి వరకు యుద్ధంలో రష్యాకు సహకరించిన బెలారస్
  • బెలారస్ గుండా ఉక్రెయిన్ లోకి వెళ్లిన రష్యా బలగాలు
  • నేరుగా సైన్యాన్ని కూడా పంపించే అవకాశం ఉందన్న అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి

ఉక్రెయిన్ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా ఆధిపత్యం కనిపిస్తోంది. బెలారస్ దేశం గుండా కూడా రష్యా ట్రూప్స్ ఉక్రెయిన్ లోకి చొరబడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు బెలారస్ నేరుగా సీన్ లోకి ఎంటర్ కాబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా బలగాలతో కలిసి ఉక్రెయిన్ ని ఆక్రమించుకునేందుకు బెలారస్ తన సైన్యాన్ని పంపే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ కు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరిగే చర్చల ఫలితం ఆధారంగా బెలారస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటి వరకు రష్యాకు బెలారస్ కేవలం సహకారాన్ని మాత్రమే అందించింది. డైరెక్ట్ గా యుద్ధంలో భాగస్వామి కాలేదు.

  • Loading...

More Telugu News