Russia: అమెరికా, ఈయూ ఆంక్షలతో పతనమవుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ.. 30 శాతం పడిపోయిన రష్యా కరెన్సీ విలువ!

Russias Ruble Tanks 30 percent value

  • ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు
  • స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యన్ బ్యాంకుల తొలగింపు
  • రష్యన్ సెంట్రల్ బ్యాంకుతో లావాదేవీలు కట్

ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తాజా ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ దారుణంగా పడిపోతోంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూబుల్ విలువ దాదాపు 30 శాతం పతనమయింది.

ప్రస్తుతం డాలర్ మారకంతో రూబుల్ విలువ 114.33కి పడిపోయింది. అంతర్జాతీయ బ్యాంక్ పేమెంట్స్ వ్యవస్థ 'స్విఫ్ట్' నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను తొలగిస్తున్నట్టు అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రష్యన్ సెంట్రల్ బ్యాంక్ తో అన్ని లావాదేవీలను ఆపేశాయి. దీంతో, రష్యన్ కరెన్సీ విలువ ఘోరంగా పతనమవుతోంది.

  • Loading...

More Telugu News