Vijay Devarakonda: ప్రైమ్ వాలీబాల్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన విజయ్ దేవరకొండ
![Vijay Devarakonda attends prime volleyball league prize distribution](https://imgd.ap7am.com/thumbnail/cr-20220227tn621ba375b80e7.jpg)
- హైదరాబాదులో వాలీబాల్ ఫైనల్స్
- విజేతగా నిలిచిన కోల్ కతా థండర్ బోల్ట్స్
- రన్నరప్ గా అహ్మదాబాద్ డిఫెండర్స్
- డిఫరెంట్ గెటప్ లో వచ్చిన విజయ్ దేవరకొండ
గత కొన్నిరోజులుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్-2022 ముగిసింది. కోల్ కతా థండర్ బోల్ట్స్ విజేతగా అవతరించింది. ఇవాళ హైదరాబాదులో జరిగిన ఫైనల్లో కోల్ కతా థండర్ బోల్ట్స్ 15-13, 15-10, 15-12తో అహ్మదాబాద్ డిఫెండర్స్ ను ఓడించింది. కాగా, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. డిఫరెంట్ గెటప్ తో వచ్చిన విజయ్ దేవరకొండ అందరినీ ఆకర్షించారు. విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి తల్లి, సోదరుడు ఆనంద్ లతో కలిసి విచ్చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220227fr621ba32012a62.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220227fr621ba3632b181.jpg)