Uttar Pradesh: యూపీలో ముగిసిన ఐదో విడత పోలింగ్
- 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
- 5 గంటల సమయానికి 53.98 శాతం పోలింగ్
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 53.98 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ యూపీలో 12 జిల్లాల్లో 61 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
కాగా, ఐదో విడత పోలింగ్ లో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య (సిరాథు నియోజకవర్గం), మంత్రులు సిద్ధార్థ్ నాథ్ సింగ్ (అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం), రాజేంద్రసింగ్ (ప్రతాప్ గఢ్), నందగోపాల్ గుప్తా నంది (అలహాబాద్ దక్షిణ నియోజకవర్గం), రాంపతి శాస్త్రి (మంకాపూర్) నుంచి బరిలో ఉన్నారు. కాగా, యూపీలో ఇంకో రెండు దశల పోలింగ్ మిగిలుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.