Prashant Kishor: సీఎం కేసీఆర్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ

Prashant Kishore met CM KCR

  • హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిశోర్
  • మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శన
  • ప్రశాంత్ కిశోర్ పక్కన ప్రకాశ్ రాజ్
  • సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన ప్రశాంత్ కిశోర్

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఇటీవల సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించి సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో జాతీయ రాజకీయాలు చర్చించడం తెలిసిందే. ఈ భేటీల సారాంశాన్ని సీఎం కేసీఆర్... ప్రశాంత్ కిశోర్ కు వివరించినట్టు తెలిసింది. 

కాగా, ప్రశాంత్ కిశోర్, నటుడు ప్రకాశ్ రాజ్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద దర్శనమిచ్చారు. వీరు సీఎం కేసీఆర్ ప్రణాళికల్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించినట్టు వెల్లడైంది. కేసీఆర్ ముంబయి పర్యటనలోనూ పాల్గొన్న ప్రకాశ్ రాజ్... రెండ్రోజుల కిందట కూడా సీఎంను కలిశారు. కేంద్రంతో పోరులో భాగంగా జాతీయస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సీఎం కేసీఆర్... ఆ దిశగా ప్రకాశ్ రాజ్ ను ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతోంది.
.

Prashant Kishor
CM KCR
TRS
Prakash Raj
Telangana
  • Loading...

More Telugu News