Ukraine: రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉక్రెయిన్
- ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా సేనలు
- కీలక నగరాలను హస్తగతం చేసుకునే ప్రయత్నం
- ఐసీజేలో దరఖాస్తు చేశామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
- వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉందని వెల్లడి
రష్యా దురాక్రమణ యత్నాలను దీటుగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్... మరోవైపు ఈ అంశంలో న్యాయపోరాటం చేయాలని నిశ్చయించింది. రష్యా దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను ఆశ్రయించింది. తీవ్ర దుందుడుకు చర్యలతో మారణహోమానికి పాల్పడుతోందని, సైనిక చర్య పేరిట దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు.
జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తమ పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరుగుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ వెల్లడించారు.