Team India: శ్రీలంకతో రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in Dharmashala
  • టీ20ల్లో వరుసగా విజయాలతో టీమిండియా
  • ఇటీవల వెస్టిండీస్ పై సిరీస్ కైవసం
  • శ్రీలంకపైనా సిరీస్ గెలిచేందుకు తహతహ
  • ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ గెలుపు
  • నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ విజయం
టీ20 వరల్డ్ కప్ లో చేదు అనుభవాలను మరిపించేలా టీమిండియా టీ20 ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇటీవల వెస్టిండీస్ పై క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... ఇప్పుడు శ్రీలంకతో టీ20 సిరీస్ విజయంపైనా కన్నేసింది. ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ నెగ్గిన భారత్ నేడు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఈ పోరులో గెలిస్తే సిరీస్ వశమవుతుంది. 

నేటి మ్యాచ్ కు ధర్మశాల ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇక, లంక జట్టులో జెఫ్రీ వాండర్సే, జనిత్ లియనాగే స్థానం బినుర ఫెర్నాండో, ధనుష్క గుణతిలక జట్టులోకి వచ్చారు. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగే ఎంచుకునే వాళ్లమని శ్రీలంక సారథి దసున్ షనక తెలిపాడు.
Team India
Toss
Sri Lanka
2nd T20
Dharmashala

More Telugu News