Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి టీజర్ రెడీ!

Ramarao On Duty teaser will release on March 1st
  • రవితేజ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ'
  • కథానాయికగా దివ్యాన్ష
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన 
  • లైన్లో మూడు ప్రాజెక్టులు  
రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలే సమయాన్ని ఖరారు చేసి ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. మార్చి 1వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నామని చెబుతూ మేకర్స్ అధికారిక పోస్టర్ ను వదిలారు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా దివ్యాన్ష కౌషిక్ .. రజీషా విజయన్ అలరించనున్నారు. 

యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాతో, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. నరేశ్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు. ఇక రవితేజ తరువాత ప్రాజెక్టుల జాబితాలో 'ధమాకా' .. 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు' కనిపిస్తున్నాయి.
Raviteja
Divyansha Koushik
Ramarao On Duty Movie

More Telugu News