Sharwanand: శర్వానంద్ ఈ సారైనా హిట్ కొట్టేనా?

Aadavallu Meeku Joharlu movie update

  • హీరోగా శర్వానంద్ కి మంచి గుర్తింపు 
  • ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ 
  • వరుసగా పలకరిస్తున్న పరాజయాలు 
  • తాజా సినిమాపైనే ఆశలు

తెలుగులో నాని తరువాత కథల ఎంపిక విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకునే కథానాయకుడిగా శర్వానంద్ కనిపిస్తాడు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' .. 'శతమానం భవతి' .. 'మహానుభావుడు' వంటి సూపర్ హిట్లు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. చాలా తక్కువ సమయంలోనే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యాడు. అలాంటి శర్వానంద్ అంచనాలు కొంతకాలంగా తప్పుతున్నాయి.

'మహానుభావుడు' తరువాత శర్వానంద్ ఇంతవరకూ హిట్ మాట వినలేదు. ప్రేమకథ నేపథ్యంలో చేసిన 'పడి పడి లేచే మనసు' .. యాక్షన్ నేపథ్యంలో చేసిన 'రణరంగం' ..  ఎమోషనల్ టచ్ తో నడిచే 'జాను' .. 'మహాసముద్రం' శర్వానంద్ తో పాటు ఆయన అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక గ్రామీణ నేపథ్యంలో వచ్చిన 'శ్రీకారం' కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఆయన నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, మార్చి 4వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమా పోస్టర్లు చూసినవారు శర్వా - రష్మిక జోడీ బాగా కుదిరిందని అంటున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనైనా శర్వానంద్ కి హిట్ పడుతుందేమో చూడాలి.

Sharwanand
Rashmika Mandanna
Aadavallu Meeku Joharlu Movie
  • Loading...

More Telugu News