Garikipati Narasimha Rao: విశ్వబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన గరికపాటి

Garikipati Narasimha Rao Apologies to gold smith

  • 2006లో ఓ చానల్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు
  • నిన్న భీమవరం వెళ్లిన గరికపాటికి నిరసన సెగ
  • ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించిన స్వర్ణకారులు
  • క్షమించమన్న గరికపాటి

2006లో ఓ చానల్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తాజాగా క్షమాపణలు తెలిపారు. అప్పట్లో గరికపాటి చేసిన వ్యాఖ్యలపై స్వర్ణకారులు ఆందోళన చేపట్టారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమం నిమిత్తం గరికపాటి నిన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చారు. అక్కడి ఆనంద్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించచిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలిసిన స్వర్ణకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి గరికపాటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాహనాలను అడ్డుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో గరికపాటి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వల్ల స్వర్ణకారులు బాధపడుతుండడం వల్ల వారికి క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. తప్పుగా మాట్లాడి వుంటే క్షమించాలని కోరారు. దీంతో విశ్వబ్రాహ్మణులు ఆందోళన విరమించారు.

Garikipati Narasimha Rao
Gold Smith
West Godavari District
Bheemavaram
  • Loading...

More Telugu News