YS Jagan: జ‌గ‌న్‌తో పోసాని కృష్ణ ముర‌ళి భేటీ

cine actor posani meets ap cm jagan

  • తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో భేటీ
  • సాయం చేసిన జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌లు తెలిపేందుకే వ‌చ్చాన‌న్న పోసాని
  • భీమ్లా నాయ‌క్ టికెట్ల గురించి త‌న‌కు తెలియ‌ద‌ని వ్యాఖ్య‌

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి భేటీ అయ్యారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి తాడేప‌ల్లి వెళ్లిన కృష్ణ‌ముర‌ళి.. జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ వ్య‌క్తిగత‌మైన‌దేన‌ని, ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని ఆ త‌ర్వాత పోసాని మీడియాకు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై మీడియా ప్ర‌తినిధులు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు పోసాని త‌న‌దైన శైలి స‌మాధానాలు ఇచ్చారు.

త‌న‌ కుటుంబం క‌రోనాతో బాధప‌డుతున్న స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి మాట సాయం చేశారని, ఏఐజి ఆసుప‌త్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే సీఎం జగన్‌ను క‌లిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వ‌చ్చాన‌ని ఆయన వెల్లడించారు.

సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న సినిమాల నుండి ప్రతిపాద‌న‌లు అందా‌కే టికెట్ల ధ‌ర‌ల‌పై నిర్ణయం వ‌స్తుందన్నారు. సీఎంతో సమావేశంలో సినిమా టికెట్ల ధ‌ర‌లపై తాను చ‌ర్చించ‌లేదని, అలీకి ఇస్తున్నట్టే త‌న‌కు ప‌ద‌వి ఇస్తున్నారు అనడంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. భీమ్లా నాయ‌క్ సినిమా టికెట్ల గురించి త‌న‌కు తెలియ‌దని, తాను సినిమా వాడినే గానీ దాని గురించి త‌న‌కు తెలియదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News