Aravind Swamy: టాలీవుడ్ తెరపై కోలీవుడ్ హీరోల విలనిజం!

Senior heros are changing as villains
  • విలన్స్ గా మారుతున్న సీనియర్ హీరోలు
  • అరవింద్ స్వామి .. అర్జున్ ఫుల్ బిజీ
  • అదే బాటలో విజయ్ సేతుపతి
  • మహేశ్ మూవీతో విక్రమ్ ఎంట్రీ
తెలుగు సినిమాల్లో గతంలో విలన్ పాత్రలు చేయాలంటే ముంబై ఆర్టిస్టులను ఎక్కువగా పిలిపించేవారు. అలా పవర్ఫుల్ ప్రతినాయకుల జాబితాను తీసుకుంటే, ముంబై విలన్లు చాలామందే కనిపిస్తారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సీనియర్ హీరోలంతా ఇప్పుడు విలన్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు.

తమిళంలో సీనియర్ హీరోలుగా చెలామణి అవుతున్న చాలామంది ఇక్కడ పవర్ఫుల్ విలన్స్ గా జెండా ఎగరేస్తున్నారు. విలన్ పాత్రలకి కూడా వారు అందుకునే పారితోషికం భారీగానే ఉంటోంది. ఆ జాబితాలో అరవింద్ స్వామి .. అర్జున్ .. విజయ్ సేతుపతి తదితరులు కనిపిస్తున్నారు. తాజాగా మహేశ్ సినిమా కోసం హీరో విక్రమ్ పేరు వినిపిస్తోంది.

ఇక టాలీవుడ్ లో కూడా హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న జగపతిబాబు, ఇప్పుడు స్టార్ విలన్ గా వెలుగొందుతున్నాడు. హీరో శ్రీకాంత్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నాడు. విలన్ గా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక రాజశేఖర్ కూడా సరైన విలన్ రోల్ కోసం చాలా కాలంగానే ఎదురుచూస్తున్నాడు.  
Aravind Swamy
Arjun
Vijay Sethupathi
Vikram

More Telugu News