Sensex: నిన్నటి భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు... 1,300 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్!

Markets ends in profits

  • 1,328 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 410 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6.54 శాతం పెరిగిన టాటా స్టీల్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న 2,700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఈరోజు ఏకంగా 1,300 పాయింట్లకు పైగా లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం లభించడంతో పాటు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో కొనసాగాయి.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,328 పాయింట్లు లాభపడి 55,858కి ఎగబాకింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగి 16,658కి చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. మెటల్, రియాల్టీ సూచీలు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈనాటి ట్రేడింగ్ లో 2,567 షేర్లు అడ్వాన్స్ కాగా, 724 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 89 షేర్లు మారకుండా స్థిరంగా ఉన్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.54%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.83%), బజాజ్ ఫైనాన్స్ (5.16%), ఎన్టీపీసీ (4.91%), టెక్ మహీంద్రా (4.26%).

సెన్సెక్స్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.25%), హిందుస్థాన్ యూనిలీవర్(-0.02%).

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు కొన్ని రోజుల పాటు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతాయని మార్కెట్ విశ్లేషకులు చెపుతున్నారు.

  • Loading...

More Telugu News