Team India: భారత్ తో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక

Sri Lanka won the toss and elected bowling first
  • భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్
  • లక్నోలో నేడు తొలి మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • టీ20 క్రికెట్లో అరంగేట్రం చేస్తున్న దీపక్ హుడా
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. లక్నోలోని వాజ్ పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు.

ఇవాళ్టి మ్యాచ్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆడడంలేదని, అతడు మణికట్టు నొప్పితో బాధపడుతున్నాడని టీమిండియా సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇక, ఇటీవలే వెస్టిండీస్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ దీపక్ హుడా ఇవాళ్టి మ్యాచ్ లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు.
Team India
Sri Lanka
Toss
Bowling

More Telugu News