KTR: 'భీమ్లా నాయక్' ఈవెంట్ కు హాజరుకావడంపై కేటీఆర్ ట్వీట్

KTR tweets about Bheemla Nayak

  • నిన్న జరిగిన 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
  • తన సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు రొటీన్ నుంచి విరామం తీసుకున్నానని వ్యాఖ్య

పవన్ కల్యాణ్, రానా నటించిన 'భీమ్లా నాయక్' చిత్రం రేపు పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తాజాగా ఈరోజు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన సోదరులు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా, తమన్, సాగర్ చంద్రల చిత్రం 'భీమ్లా నాయక్' విడుదల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నానని ఆయన చెప్పారు. మొగిలయ్య, శివమణి వంటి బ్రిలియంట్ సంగీత విద్వాంసులను కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News