Russia: ర‌ష్యా చేస్తోంది భీక‌ర యుద్ధ‌మే.. ఉక్రెయిన్‌లో దెబ్బ‌తిన్న అపార్ట్‌మెంట్లు.. వీడియోలు ఇవిగో

russia attacks in ukrain

  • ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం
  • కీల‌క ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన ర‌ష్యా
  • ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్రకారం దాడులు

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్లోని కీల‌క ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన ర‌ష్యా బ‌ల‌గాలు ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్రకారం దాడులు జ‌రుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌పై ప్ర‌ధానంగా దాడులు జ‌రుగుతున్నాయి.  

                       
జ‌నావాస ప్రాంతాల్లో దాడులు చేయ‌ట్లేద‌ని ర‌ష్యా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నప్ప‌టికీ ప‌లు అపార్ట్‌మెంట్లపై బాంబులు ప‌డుతుండ‌‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను ప‌లు స్థానిక‌, అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు బ‌య‌ట‌పెట్టాయి. ర‌ష్యా భీక‌ర యుద్ధ‌మే చేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాల‌పై కూడా ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డింది. ప్రాణ‌న‌ష్టంపై వివ‌రాలు స్ప‌ష్టంగా తెలియ‌రావ‌ట్లేదు.

  • Loading...

More Telugu News