telugu: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు.. తెలంగాణ ఎన్నారై సెల్‌కు అధికారుల ఫోన్

telugu stuedents in ukrain

  • ఉక్రెయిన్‌లో సుమారు 400 మంది వరకు తెలుగు వారు
  • 350 మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆందోళన‌
  • విదేశాంగ శాఖ‌కు ఫోన్‌లు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే ఉక్రెయిన్ తన గ‌గ‌న‌త‌లాన్ని మూసేసింది. పర్యవసానంగా వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భారీగానే ఉన్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 400 మంది వరకు తెలుగు వారు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలుగు విద్యార్థుల త‌ల్లిదండ్రులు అభ్య‌ర్థ‌న‌లు చేసుకుంటున్నారు.

త‌మ పిల్ల‌ల‌ను ఎలాగైనా స్వ‌దేశానికి ర‌ప్పించాల‌ని కోరుతున్నారు. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని తాము కూడా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో  సంబంధిత అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల చిరునామాల‌ను సేక‌రిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులకు వారు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ కూడా చెప్పింది. భారత్ నుంచి ఉక్రెయిన్‌కు ఎయిర్ ఇండియా మాత్రమే విమానాలు న‌డుపుతోంది. అయితే, అక్క‌డ‌కు వెళ్లిన ఓ ఎయిర్ ఇండియా భార‌త్‌కు ఖాళీగానే తిరుగు ముఖం ప‌ట్టింది. ఈ నెల 26 న భారత్ నుంచి మ‌రో ప్ర‌త్యేక విమానం వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల నడుమ అది వెళ్తుందా? అన్న సందేహాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్రానికి ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా లేఖ‌రాసి, ఏపీ విద్యార్థుల‌ను ర‌ప్పించాల‌ని కోరారు.

  • Loading...

More Telugu News