Ram Gopal Varma: పవన్ కల్యాణ్ ప్రసంగంపై రామ్ గోపాల్ వర్మ స్పందన

Pawan Kalyan speech is fantastic says Ram Gopal Varma
  • నిన్న అట్టహాసంగా జరిగిన 'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్
  • పవన్ స్పీచ్ అద్భుతంగా ఉందన్న వర్మ
  • పవన్ ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉందని కితాబు
పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు తరలి వచ్చారు. మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్ ప్రసంగం ఎంతో హుందాగా, అద్భుతంగా, మనసును హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉందని ఆయన కితాబునిచ్చారు. ఆయన ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉందని చెప్పారు.
Ram Gopal Varma
Pawan Kalyan
Rana Daggubati
Bhaeemla Nayak
Tollywood
KTR
TRS

More Telugu News