Russia: బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్ లోకి భారీగా బలగాల ప్రవేశం
- వందలాది యుద్ధట్యాంకుల ఎంట్రీ
- ఇవాళ ఉదయం బెలారస్ అధ్యక్షుడికి పుతిన్ ఫోన్
- యుద్ధ పరిస్థితులపై చర్చ
ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో బెలారస్ సరిహద్దుల గుండా రష్యా బలగాలు.. ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి. బెలారస్ లోని వెసెలోవ్కా నుంచి ఉక్రెయిన్ లోని సెంకెవ్కాలోకి వందలాది సైనిక వాహనాలు ఎంటరయ్యాయి. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం 6.48 గంటలకు బలగాలు వచ్చాయి. భారీగా యుద్ధ ట్యాంకులు హైవే ద్వారా వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
కాగా, ఉక్రెయిన్ లోని యుద్ధ పరిస్థితులపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ఇరు దేశాల అధ్యక్షులు ఫోన్ లో మాట్లాడుకున్నట్టు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సరిహద్దులతో పాటు డాన్బాస్ లో ఉన్న యుద్ధ పరిస్థితులను లుకషెంకోకు వివరించినట్టు తెలుస్తోంది.