Russia: ఉక్రెయిన్ ను ఆక్రమించేస్తున్న రష్యా..  రెండు గంటల్లోనే రాజధాని కీవ్ లో రష్యా మకాం!

Russia invades Ukraine

  • గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను ఆక్రమిస్తున్న రష్యా
  • 10 నిమిషాలకు ఒక నగరం చొప్పున ఆక్రమణ
  • ఏ మాత్రం ప్రతిఘటించని ఉక్రెయిన్

యుద్ధాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించేస్తోంది. ఇంత వేగంగా ఒక దేశాన్ని ఆక్రమిస్తుండటం బహుశా ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చేమో. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ప్రకటించిన నాలుగు గంటల వ్యవధిలోనే... ఉక్రెయిన్ లోని 13 ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. ఈ నగరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కేవలం రెండు గంటల్లోనే రష్యా బలగాలు మకాం వేశాయి. కీవ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ బలగాల బాంబుదాడులతో ఉక్రెయిన్ వణుకుతోంది.

మరోవైపు ఉక్రెయిన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావడం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తరహాలో రష్యా విరుచుకుపడుతోంది. ప్రతి 10 నిమిషాలకు ఒక్కో నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుందంటే రష్యా దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కా ప్రణాళికతో ఉక్రెయిన్ కు ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వని విధంగా రష్యా దాడి చేస్తోంది.

Russia
Ukraine
War
  • Loading...

More Telugu News