Sensex: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

Markets collapses as Russia begin war on Ukraine

  • 1,903 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 547 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • నష్టాల్లో ట్రేడ్ అవుతున్న అన్ని సూచీలు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. రష్యన్ బలగాలు ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. మన దేశీయ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 1,903 పాయింట్లు కోల్పోయి 55,370కి పడిపోయింది. నిఫ్టీ 547 పాయింట్లు కోల్పోయి 16,516కి దిగజారింది. అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. టెలికాం సూచీ 5 శాతానికి పైగా, రియాల్టీ సూచీ 4 శాతానికి పైగా, టెక్, ఐటీ, పవర్, బ్యాంకెక్స్, మెటల్ తదితర సూచీలు 3 శాతానికి పైగా పతనమయ్యాయి.

  • Loading...

More Telugu News