YS Vivekananda Reddy: వైఎస్ కుటుంబ సభ్యులను ఇరికిస్తాననేవాడు.. అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు: దస్తగిరి వాంగ్మూలంపై భరత్ యాదవ్

Bharat Yadav Response On Dastagiri Statement

  • తాను దస్తగిరిని బెదిరించలేదని వెల్లడి
  • ఎప్పుడూ డబ్బులు కావాలనేవాడని ఆరోపణ
  • ఇప్పుడూ డబ్బుల కోసమే తమపై ఆరోపణలని కామెంట్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ యాదవ్.. వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపై స్పందించాడు. దస్తగిరి వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఈ మేరకు తనతో దస్తగిరి మాట్లాడిన ఓ ఆడియోను భరత్ యాదవ్ ఇవాళ విడుదల చేశాడు.

దస్తగిరి ఆరోపణలేవీ నిజం కాదని తెలిపాడు. అతడిని ఎవరూ బెదిరించలేదని, అయినా అప్రూవర్ గా మారాక ఎందుకు బెదిరిస్తారని ప్రశ్నించాడు. మామిడి తోట వద్దకు దస్తగిరిని ఎవరూ రమ్మనలేదని స్పష్టం చేశాడు. లాయర్ ఓబుల్ రెడ్డిని కలవాలంటూ చెప్పలేదన్నాడు. డబ్బుల కోసమే తమపై దస్తగిరి ఆరోపణలు చేస్తున్నాడని తెలిపాడు. డబ్బులు కావాలంటూ పదేపదే అడిగేవాడని పేర్కొన్నాడు.

వైఎస్ కుటుంబ సభ్యులను వివేకా హత్యకేసులో కచ్చితంగా ఇరికిస్తానంటూ దస్తగిరి బెదిరించేవాడని, అందులో భాగంగానే ఇప్పుడు వారిని ఇరికించేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భరత్ యాదవ్ ఆరోపించాడు.

  • Loading...

More Telugu News