Jagan: మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌ల క్ర‌తువు ప్రారంభం.. క‌డ‌ప నుంచి హెలికాఫ్టర్‌లో ఉద‌య‌గిరికి జ‌గ‌న్

jagan to visit udayagiri

  • ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీ స‌మీపంలో అంత్య‌క్రియ‌లు
  • భారీగా హాజ‌రైన వైసీపీ కార్య‌క‌ర్త‌లు
  • మొద‌ట‌ గన్నవరం నుంచి కడప వ‌చ్చిన జ‌గ‌న్

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌ల క్ర‌తువు ప్రారంభ‌మైంది. ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీ స‌మీపంలో అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి బ‌య‌లుదేరారు.

ప్రభుత్వ లాంఛనాలతో మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. అంత్య‌క్రియ‌ల‌కు భారీగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ప‌లువురు వైసీపీ నేత‌లు కూడా ఉద‌య‌గిరికి చేరుకున్నారు. గౌత‌మ్ రెడ్డి కుమారుడు అమెరికా నుంచి రావ‌డం ఆల‌స్యం కావ‌డంతో నేడు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు.

Jagan
YSRCP
Mekapati Goutham Reddy
  • Loading...

More Telugu News