KPAC Lalitha: ‘లలిత’కు మమ్ముట్టి, కీర్తి సురేశ్ తదితరుల నివాళులు

To Malayalam Actor KPAC Lalitha Tributes From Mammootty Prithviraj Sukumaran Keerthy Suresh

  • ఎంతో ప్రియమైన వ్యక్తిని కోల్పోయానన్న మమ్ముట్టి 
  • మీతో కలసి నటించడం అదృష్టమన్న పృథ్వీరాజ్ 
  • ప్రేక్షకుల మనుసుల్లో జీవించే ఉంటారన్న రేవతి 

సీనియర్ నటి, కేపీఏసీ లలిత మృతి పట్ల మలయాళ అగ్రనటులు మమ్ముట్టితోపాటు, కీర్తి సురేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, రేవతి సంతాపం వ్యక్తం చేశారు. లలితతో తమకున్న అనుబంధాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు.

‘‘నాకు ఎంతో ప్రియమైన వ్యక్తిని కోల్పోయాను. ఎన్నో చిరకాల జ్ఞాపకాలతో ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నాను’’ అని మమ్ముట్టి మలయాళంలో ట్వీట్ చేశారు.

‘‘మీతో కలసి వెండి తెరను పంచుకోవడం నాకు లభించిన అదృష్టం. నాకు తెలిసిన గొప్ప నటుల్లో మీరు ఒకరు. రెస్ట్ ఇన్ పీస్ లలితా ఆంటీ’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ చేశారు.

‘‘లెజెండరీ కేపీఏసీ ఆంటీ మరణించారని వినాల్సి రావడం ఎంతో బాధకు గురి చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ కీర్తి సురేశ్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా లలిత బాల్య నటిగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కనిపించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

నిర్మాత, నటి అయిన రేవతి ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ‘‘మీరు నటించిన పాత్రలతో తరతరాల పాటు ప్రేక్షకుల మనుసుల్లో జీవించే ఉంటారని’’ పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News